అంతర్జాతీయ వేదికపై ఇండియన్ విస్కీ ఇంద్రి కి అవార్డు .. నంబర్ వన్ బ్రాండ్ గా గుర్తింపు ..
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) అంతర్జాతీయ వేదికపై ఇండియన్ విస్కీ బ్రాండ్ ఇంద్రి (indri) సత్తా చాటింది. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ లో బెస్ట్ వరల్డ్ విస్కీగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ వెగాస్ లో గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025 కార
ఇండియన్ విస్కీ


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)

అంతర్జాతీయ వేదికపై ఇండియన్

విస్కీ బ్రాండ్ ఇంద్రి (indri) సత్తా చాటింది. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ లో బెస్ట్ వరల్డ్ విస్కీగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ వెగాస్ లో గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం జరగ్గా ఫైనల్స్ లో ఐదు విస్కీ బ్రాండ్లు నిలిచాయి. వీటిలో నాలుగు భారతీయ విస్కీలే ఉండటం విశేషం. ఇక ఇందులో 99.1 పాయింట్లతో ప్రపంచ బెస్ట్ విస్కీగా నిలిచి ఇంద్రి గౌరవం పొందింది. గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ పోటీని లాస్ వెగాస్ కు చెందిన ఓ విస్కీ పరిశ్రమ నిర్వహిస్తుంది.

ఇక ఈ బ్రాండ్ విషయానికి వస్తే.. హర్యానాలోని ఇంద్రీలోని పికాడిలీ డిస్టిలరీస్ సాంప్రదాయ రాగి కుండ స్టిల్స్ ఉపయోగించి బార్లీ నుండి దీనిని తయారు చేస్తారు.ఇండియాలో 750ml బాటిల్ ధర సుమారుగా రూ.5 వేల నుండి రూ.6,500 వరకు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande