విజయవాడ, 3 అక్టోబర్ (హి.స.)ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఆలయంలో) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఏడాది 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. ఈ మహోత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ అమ్మను కనులారా చూసుకుని భక్తులు పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రికార్డు నెలకొంది. గత ఏడాది కంటే 10 శాతం భక్తుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది దుర్గమ్మను 15 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ 11 రోజుల్లో దుర్గమ్మ ఆలయ ఆదాయం రూ.4.38 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ