మద్యం అమ్మకాల్లో ‘దసరా' మార్క్.. రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల విక్రయాలు
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా... రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ, అంతకు ముందు, మరియు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక
మద్యం అమ్మకాలు


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)

దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా... రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ, అంతకు ముందు, మరియు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే రూ.419 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. వాటిలో సెప్టెంబర్ 30 ఒక్కరోజే రూ.333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. సాధారణ రోజులతో పోల్చితే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరగొచ్చని అంచనా. తెలంగాణలో ఎప్పటిలానే మద్యం అమ్మకాల్లో 'దసరా' మార్క్ కన్పిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande