మలేసియా ప్రజాప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.) అమరావతి: మలేసియా ప్రజాప్రతినిధుల బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. రాజధానిలోని నిర్మాణాల గురించి వారికి... మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబు, అదనపు కమిషనర్‌ భార్గవ్‌ తేజ వివరించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్క
మలేసియా ప్రజాప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించింది


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)

అమరావతి: మలేసియా ప్రజాప్రతినిధుల బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. రాజధానిలోని నిర్మాణాల గురించి వారికి... మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబు, అదనపు కమిషనర్‌ భార్గవ్‌ తేజ వివరించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కనే నిర్మిస్తున్న సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సముదాయాల వివరాలను మలేసియా బృందానికి అధికారులు తెలిపారు. రెండున్నరేళ్లలో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయ‌క‌త్వంలో ప్రపంచ‌లో టాప్ 5 రాజ‌ధానుల్లో అమ‌రావ‌తిని ఒక‌టిగా రూపుదిద్దుతామ‌ని స్పష్టంచేశారు. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేసియాకు చెందిన ప‌లు ప్రైవేటు సంస్థలు ఆస‌క్తి కనబరిచినట్లు మంత్రి తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు పెట్టుబ‌డులు పెట్టేలా ప‌లు ప్రాజెక్టులను మంత్రి నారాయ‌ణ‌కు మ‌లేసియా ప్రతినిధులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande