ఛత్తీస్గఢ్ లో 103 మంది మావోయిస్టులు సరెండర్
చత్తీస్గడ్, 3 అక్టోబర్ (హి.స.) ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 49 మందిపై కలిసి రూ. 1 కోటి వరకు రివార్డు ఉన్న
మావోయిస్టు


చత్తీస్గడ్, 3 అక్టోబర్ (హి.స.)

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 49 మందిపై కలిసి రూ. 1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు తెలిపారు. సరెండర్ అయిన వారిలో 22 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి, అంతర్గత కలహాల కారణంగా మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ ఒక్కరోజులో ఇంతమంది మావోయిస్టులు లొంగిపోవడం ఇదే తొలిసారి ఆయన స్పష్టం చేశారు.

సరెండర్ అయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణం సాయం కింద రూ.50 వేల చొప్పున నగదు సాయం అందజేశారు. లొంగిపోయిన వారిలో రివల్యూషనరీ పార్టీ కమిటీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలో 410 మంది మావోయిస్టులు సరెండర్ కాగా, 421 మంది అరెస్టు అయినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande