సచివాలయం లో మలేషియా ప్రతినిధులతో మాతృ నారాయణ భేటీ
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.):సచివాల‌యంలో మలేషియా ప్ర‌తినిధుల‌తో మంత్రి నారాయ‌ణ‌, సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబుఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా
సచివాలయం లో మలేషియా ప్రతినిధులతో మాతృ నారాయణ భేటీ


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.):సచివాల‌యంలో మలేషియా ప్ర‌తినిధుల‌తో మంత్రి నారాయ‌ణ‌, సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబుఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా - ఆంధ్రా బిజినెస్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల పురోగ‌తిని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత భేటీ జరుగుతోంది. అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్న‌రేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande