హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్, నగరంలో గతంలో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం హౌసింగ్ పథకం ఇప్పుడు కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో మళ్లీ ప్రారంభమైంది. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చార్మినార్, మలక్పేట్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంత్రి సంబంధిత పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. నిలిచిపోయిన ఇళ్ల పంపిణీని వేగంగా పూర్తి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభసభ్యుడు అనిల్కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు