త్వరలో రైతుల ఖాతాలో ధాన్యం బోనస్ : మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ, నారాయణపేట. 3 అక్టోబర్ (హి.స.) త్వరలోనే రైతుల ఖాతాలోకి ధాన్యంకి సంబంధించిన బోనస్ వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం మక్తల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రైతులతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన సన్నధాన్యం
మంత్లీ శ్రీహరి


తెలంగాణ, నారాయణపేట. 3 అక్టోబర్ (హి.స.)

త్వరలోనే రైతుల ఖాతాలోకి ధాన్యంకి

సంబంధించిన బోనస్ వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం మక్తల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రైతులతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన సన్నధాన్యం క్వింటాలుకు ఐదువందల బోనస్ త్వరలో రైతుల ఖాతాలో జమ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయానికి అనుగుణంగా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ చేస్తామని మంత్రి చెప్పారు.

అలాగే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సంబంధిత రెవెన్యూ వ్యవసాయ అదికారులతో సర్వే చేయించి నివేదిక ప్రకారం.. రైతులను ఆదుకోంటామని వాకిటి శ్రీహరి చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande