వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా.. ప్రశాంత్ కిషోర్
హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నేటికి ఫైర్ అవుతూనే ఉన్నాడు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డిన
ప్రశాంత్ కిషోర్


హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.)

గతంలో బీహార్ ప్రజలపై సీఎం రేవంత్

రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నేటికి ఫైర్ అవుతూనే ఉన్నాడు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ప్రచారంలో ఉపయోగించాలని చూస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్.. బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై ఆడుగు పెడితే తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడు... వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అలాగే తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపడలేరని, బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని, మళ్లీ తిరిగి ఇంకోసారి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని అన్నాడు. అలాగే బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అయినప్పుడు. ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని పీకే ప్రశ్నించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande