విశాఖపట్నం, 3 అక్టోబర్ (హి.స.)
:దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ.. బలహీనపడుతోందని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం ఉత్తరకోస్తా జిల్లాల్లో.. వర్షం తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. అయితే.. రేపు(శుక్రవారం) పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు బాంబు పేల్చింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఉన్న నదులకు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ