తెలంగాణ, సూర్యాపేట. 3 అక్టోబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లాలో ఘోర
రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తుంగతుర్తి మండలం బండరామరం వద్ద గురువారం అర్ధరాత్రి ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న కార్తీక్ కు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోయారు. నాగరాజు బలమైన గాయాలతో కొనఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రి, అక్కడనుండి నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. కాగా మృతి చెందిన ఇరువురు సోదరులు అవివాహితులు. వేముల నాగరాజు హైదరాబాద్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు