అనంతపురం, 3 అక్టోబర్ (హి.స.)
:తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిర్బంధించారు. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మేరకు పోలీసులపై పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ