ట్రావెల్స్ బస్సులో రూ.7.31 లక్షల డ్రగ్స్ సీజ్..
తెలంగాణ, జహీరాబాద్. 3 అక్టోబర్ (హి.స.) గోవా నుంచి హైదరాబాద్ వచ్చే ఓ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.7.31 లక్షల విలువైన డ్రగ్స్ సహా బస్సు సీజ్ చేసినట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వారు ఈ విషయంపై మీడియాతో
డ్రగ్స్


తెలంగాణ, జహీరాబాద్. 3 అక్టోబర్ (హి.స.)

గోవా నుంచి హైదరాబాద్ వచ్చే ఓ

ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.7.31 లక్షల విలువైన డ్రగ్స్ సహా బస్సు సీజ్ చేసినట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వారు ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులుగా నిరంతరం వాహన తనిఖీలు చేపట్టామని, ప్రధానంగా గోవా నుంచి హైదరాబాద్ వచ్చే ట్రావెల్స్ బస్సులలో మత్తు పదార్థాలు ఇతర నాన్ డ్యూటీ పేడ్ మద్యం అక్రమ రవాణా నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో జీఎంసీ ట్రావెల్స్ బస్సు ను తనిఖీ చేయగా అందులో 195 బాక్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 7,31,250 లక్షల విలువగల నైట్రోఫామ్ గుర్తించి సీజ్ చేశామన్నారు. అదేవిధంగా బస్సును కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande