పల్నాడు: 3 అక్టోబర్ (హి.స.)
సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించారు. గుడ్ మార్నింగ్ హోటల్ యజమానిపై యనమల నాగార్జున యాదవ్ దాడికి పాల్పడ్డారు. సరైన సమయంలో టిఫిన్ అందించలేదని హోటల్ యజమాని శేఖర్, సిబ్బందిపై ఆయన అనుచరులతో దాడకి దిగారు. ఈ ఘర్షణలో హోటల్ సిబ్బందిలో ఇద్దరికి గాయాలయ్యాయి. తాను పిలిస్తే.. ఊళ్లకు ఊళ్ళు కదలి వస్తాయని హోటల్ యజమాని శేఖర్‌కు నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ