ఢిల్లీ, ,03 అక్టోబర్ (హి.స.) ఎగ్జిబిషన్ మైదానంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ ప్రారంభమైంది. ఏటా దసరా మర్నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, భాజపా ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ సినీనటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనాచౌదరి, సీపీఐ నేత నారాయణ, తెజస నేత ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా అలయ్ బలయ్ మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ