చెన్నైలో హై అలెర్ట్.. సీఎం స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బెదిరింపులు!
చెన్నై, 3 అక్టోబర్ (హి.స.) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఉదయం వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. తమిళనాడులోని (Chennai) చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు వచ్చిన (Bomb threats) బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది. ప్రముఖ నటి త్రిష (actress Trish
/bomb-threats-to-cm-stalin-and-actress-trisha-in-chennai


చెన్నై, 3 అక్టోబర్ (హి.స.)

తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఉదయం వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. తమిళనాడులోని (Chennai) చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు వచ్చిన (Bomb threats) బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది. ప్రముఖ నటి త్రిష (actress Trisha) ఇంట్లో బాంబు పెట్టారని తెలియడంతో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అప్రమత్తమయ్యారు. తేనాంపేటలోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నటుడు ఎస్వీ శేఖర్ ఇంటికి కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆళ్వార్‌పేటలోని సీఎం స్టాలిన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే అన్ని ప్రదేశాల్లోనూ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో పోలీసులు వాటిని ఫేక్ కాల్స్ అని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఫోన్ నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో చెన్నైలో కొద్ది గంటల పాటు భయం, ఆందోళన నెల కొన్నప్పటికీ చివరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande