అహ్మదాబాద్, 3 అక్టోబర్ (హి.స.) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 121/2తో ఈ ఉదయం రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్ 188 పరుగుల వద్ద శుభమన్ గిల్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 100 బంతులు ఎదుర్కొన్న గిల్ సరిగ్గా 50 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్‌తో కలిసి రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో 19 బంతుల్లో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. రాహుల్ శతకంలో 12 ఫోర్లు ఉన్నాయి. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి విండీస్ కంటే 56 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 4 వికెట్లు తీసుకోగా, బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV