సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’: రాష్ట్రపతి ముర్ము సందేశం
ఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.)సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే (Alai Balai) అలాయ్ బలాయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ సందర్
ముర్ము


ఢిల్లీ, 3 అక్టోబర్ (హి.స.)సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలాయ్ బలాయ్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే (Alai Balai) అలాయ్ బలాయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. ‘అలాయ్ బలాయ్’ ఉత్సవాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, ఈ పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి, ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవం నవరాత్రి వేళల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande