నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.
ముంబై,03 అక్టోబర్ (హి.స.) మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్
Signs of strength from global markets, buying trend in Asian markets too


ముంబై,03 అక్టోబర్ (హి.స.) మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.

బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్‌గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande