రామభద్రపురం, 4 అక్టోబర్ (హి.స.)
: విజయనగరం జిల్లా రామభద్రపురం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద గుండెపోటుతో కండక్టర్ దాసు మృతి చెందారు. సాలూరు నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సు కాంప్లెక్స్ దాటుతుండగా ఘటన చోటు చేసుకుంది. కండక్టర్ దాసు సీట్లోనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ను రామభద్రపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రామభద్రపురం ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ