అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్, దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు (శనివారం) ఉదయం విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. విగ్రహాల నిమజ్జన క్రేన్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు కాసుల కక్కుర్తి పడినట్లు తెలుస్తోంది. కమిషన్ల కోసం అధికారుల దురాశతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అనుభవం లేని సర్వీస్‌కు టెండర్ అప్పగించడంతో సరూర్‌నగర్ చెరువు వద్ద క్రేన్ పల్టీ కొట్టింది. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ