లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. ఈ సమస్యలన్నీ పరార్..! శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..
కర్నూలు, 4 అక్టోబర్ (హి.స.)సరికాని ఆహారపు అలవాట్లు కడుపు నొప్పికి కారణమవుతాయి. ఉదయాన్నే మీ కడుపుని శుభ్రం చేయకపోవడం వల్ల రోజంతా అసౌకర్యం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని శుభ్రం చేసుకోవడానికి కొన్ని సహాజ ఇంటి నివారణలు అద్బుతంగా పనిచేస్త
మాిా


కర్నూలు, 4 అక్టోబర్ (హి.స.)సరికాని ఆహారపు అలవాట్లు కడుపు నొప్పికి కారణమవుతాయి. ఉదయాన్నే మీ కడుపుని శుభ్రం చేయకపోవడం వల్ల రోజంతా అసౌకర్యం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని శుభ్రం చేసుకోవడానికి కొన్ని సహాజ ఇంటి నివారణలు అద్బుతంగా పనిచేస్తాయి. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట గోరు వెచ్చని పాలు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో మలబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, పాలలో వంటింట్లో లభించే ఒక మసాలా పదార్థాన్ని కలిపితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. . లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే షాకింగ్ ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అదేలాగో ఇక్కడ చూద్దాం..

లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి. అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. లవంగాల పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. లవంగం పొడిని పాలలో కలిపి తాగితే జీవ క్రియ వేగవంతం అవుతుంది.

లవంగం పాలు తాగటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పాలు తాగటం వల్ల పెద్దపేగును శుద్దిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి. పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి దూరం చేస్తుంది.

ఉదయం మీ కడుపు సరిగ్గా శుభ్రం కాకపోతే, రాత్రిపూట లవంగాలతో కలిపిన పాలు త్రాగండి. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక లవంగాన్ని వేసి బాగా మరిగించి, త్రాగడం వల్ల కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande