తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీ వర్షం కురిసింది
అమరావతి, 4 అక్టోబర్ (హి.స.) టెంపుల్ సిటీ తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రా
తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీ వర్షం కురిసింది


అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)

టెంపుల్ సిటీ తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు జామ్ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

అయితే, తిరుపతిలోని ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ దగ్గర కూడా నీరు నిలిచిపోవడంతో.. ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చిన్న వాహనాలను రోడ్డు పైకి అనుమతించడం లేదు. భారీ వాహనాలకు మాత్రమే రోడ్లపైకి పర్మిషన్ ఇస్తున్నారు. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకుని ఆగిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande