పసిడి ప్రియులకు బిగ్‌షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ కొనాలంటే..
ముంబై, 4 అక్టోబర్ (హి.స.)బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ అమాంతంగా ఎగిరిపోతోంది బంగారం. దసరా తరువాత గోల్డ్‌ ధర దిగుతుందని చాలా మంది భావించారు. కానీ, అక్టోబర్‌ మొదటి వారంలోనే పుత్తడి ధర కొండెక్కి కూర్చుంది. నిన్న తగ్గినట్టే తగ్గి
Gold


ముంబై, 4 అక్టోబర్ (హి.స.)బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ అమాంతంగా ఎగిరిపోతోంది బంగారం. దసరా తరువాత గోల్డ్‌ ధర దిగుతుందని చాలా మంది భావించారు. కానీ, అక్టోబర్‌ మొదటి వారంలోనే పుత్తడి ధర కొండెక్కి కూర్చుంది. నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు నేడు అమాతం పెరిగాయి. రాను..కిందకు దిగి రాను అంటోంది బంగారం.. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే గోల్డ్‌ రేట్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఇవాళ కూడా పసిడి బంగారం ధర భారీగా పెరిగింది.

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి షట్ డౌన్ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా ఈ రోజు శనివారం ఉదయం మార్కెట్‌ ప్రారంభ సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ఎంత ఉందంటే..

అక్టోబర్‌ 4 ఉదయం 10గంటల తరువాత బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముపై 87 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములు రూ.1,19,400లకు చేరింది. కాగా, నిన్న 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర1,18,530లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande