తిరుపతి, 4 అక్టోబర్ (హి.స.)తిరుపతికి మరోసారి బాంబు బెదింరిపు ఈ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఇస్కాన్‌లో సైతం బాంబులు పెట్టారని ఈమెయిల్ లో హెచ్చరించారు. మొత్తం మూడు ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నాయని ఈమెయిల్ లో పేర్కొన్నారు. దీంతో ఉదయం నుండి తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం సైతం ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇంటికి సైతం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు చోట్ల డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV