కాంగ్రెస్ పార్టీలో మరో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
జైపుర, 4 అక్టోబర్ (హి.స.)కాంగ్రెస్ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో గత బుధవారం కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ముగియకముందే ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అకాల మరణం కాంగ్రెస్‍ శ్రేణులను షాక్‍కు గురి చేసింది. ర
కాంగ్రెస్ పార్టీలో మరో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత


జైపుర, 4 అక్టోబర్ (హి.స.)కాంగ్రెస్ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో గత బుధవారం కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ముగియకముందే ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అకాల మరణం కాంగ్రెస్‍ శ్రేణులను షాక్‍కు గురి చేసింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రామేశ్వర్ లాల్ దూడి (Rameshwar Dudi) శనివారం కన్నుమూశారు.

రెండేళ్లుగా కోమాలో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. 1963 జులై 1న జన్మించిన ఆయన విద్యార్థి జీవితం నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.1999-2004 వరకు బికనీర్ ఎంపీగా పనిచేశారు. 22014-2018 వరకు నోఖా అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి గెలుపొంది రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. తన రాజకీయ జీవితంలో అణగారిన, దోపిడీకి గురైన బాధితుల పక్షాన పోరాటం చేశారు. రెండేళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. ఆయన మరణం పట్ల రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. రామేశ్వర్ మరణం వ్యక్తిగతంగా నాకు భారీ దెబ్బ అని ఎక్స్ లో పోస్టు చేశారు. రామేశ్వర్ లాల్ దూడి మరణవార్త అత్యంత దురదృష్టకరం అని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. శోకసంద్రంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ లో స్పందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande