ఢిల్లీ, 4 అక్టోబర్ (హి.స.)దేశవ్యాప్తంగా ఉన్న వాహన దారులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీసుకొచ్చిన కొత్త రూల్స్ (New rules..).. శుభవార్త అందించాయి. కాగా జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల (FASTag payments) విషయంలో కేంద్రం రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకు సాధారణ రుసుంకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధనను సడలించింది. కొత్త మార్పుల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్ లేని, పనిచేయని వాహనాలు యూపీఐ (UPI) ద్వారా చెల్లించినా, సాధారణ టోల్ ఛార్జ్ కంటే 1.25 రెట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండో నిబంధనలో.. ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) ప్రవేష పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్షిక పాస్.. ఈ పాస్, రూ. 3,000 చెల్లించి, 200 టోల్ ప్లాజాల దాటింపులు లేదా ఒక సంవత్సరం కాలపరిమితి (ఏది ముందుగా వస్తుందో) వరకు వాడుకోవచ్చు. ఈ పాస్‌ను NHAI అధికారిక వెబ్‌సైట్, రాజ్మార్గ్ యాత్ర యాప్ (Rajmarg Yatra App) ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. కాగా ఈ రెండు కొత్త నిబంధనలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV