'కోల్డ్రిఫ్' దగ్గు మందు అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వ నిషేధం
చెన్నై, 4 అక్టోబర్ (హి.స.) మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న తీవ్ర అనుమానాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ''కోల్డ్రిఫ్'' అనే దగ్గు మందుపై ఉక్కుపాదం మోపింది. చెన్నైకి చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ఈ స
'కోల్డ్రిఫ్' దగ్గు మందు అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వ నిషేధం


చెన్నై, 4 అక్టోబర్ (హి.స.)

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న తీవ్ర అనుమానాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం 'కోల్డ్రిఫ్' అనే దగ్గు మందుపై ఉక్కుపాదం మోపింది. చెన్నైకి చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ఈ సిరప్ అమ్మకాలను తక్షణమే నిలిపివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్టు ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు గత రెండు రోజులుగా కాంచీపురం జిల్లాలోని సుంగువార్‌చత్రంలో ఉన్న సంబంధిత ఫార్మా కంపెనీ తయారీ కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్కడి నుంచి దగ్గు మందు శాంపిళ్లను సేకరించినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన 'డైఇథిలీన్ గ్లైకాల్' అనే రసాయనం ఉనికిని గుర్తించేందుకు ప్రభుత్వ ల్యాబొరేటరీలకు పంపినట్లు వివరించారు. ఈ కంపెనీ ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఔషధాలను సరఫరా చేస్తోంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా చిన్నారుల మరణాలు కలకలం రేపడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. రెండేళ్లలోపు పిల్లలకు ఎలాంటి దగ్గు, జలుబు మందులను సూచించవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande