తిరుమల, 4 అక్టోబర్ (హి.స.)ఇటీవల ఏర్పడిన వాయుగుండం తీరం దాటి.. అల్పపీడనం (low pressure)గా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) కొండపై ఈ రోజు తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుంది. దీంతో తిరుమల వీధులన్ని జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే వరుస సెలవులు కావడంతో తిరుమల కొండపైకి భక్తులు భారీ ఎత్తున చేరుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికి శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా ఘాట్ రోడ్లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV