అమరావతి, 4 అక్టోబర్ (హి.స.) ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
థియేట్రికల్ రన్‌లో మిరాయ్ రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది టాలీవుడ్ లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ‘మిరాయ్’ కథలో పురాణ గాథలు, దైవశక్తులు, ఆధునిక సాహసాలు కలిసిన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను కార్తీక్ ఘట్టమనేని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. సామ్రాట్ అశోక్ కాలం నాటి దైవశక్తి, తొమ్మిది గ్రంథాలు, వాటి రక్షకులు, మానవ లోభం మధ్య జరిగే యుద్ధం ఈ కథకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సీన్స్, విజువల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV