తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా ‘సుప్రీం’లో రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యం
–చెన్నై ,05 అక్టోబర్ (హి.స.) కుంభకోణం విశ్వవిద్యాలయం బిల్లును ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతికి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుపై కుంభకోణంలో విశ్వవ
Supreme Court


–చెన్నై ,05 అక్టోబర్ (హి.స.) కుంభకోణం విశ్వవిద్యాలయం బిల్లును ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతికి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుపై కుంభకోణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్‌లో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి, అసోసియేట్‌ ఛాన్సలర్‌గా ఉన్నత విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారని.. ఛాన్సలర్‌ అనుమతి లేకుండా గవర్నర్‌ పట్టాలు ప్రదానం చేయడం కుదరదని అందులో పేర్కొన్నారు. ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో ఆయన దాన్ని రాష్ట్రపతికి పంపారు. బిల్లుకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి పంపడం శాసనసభ నిర్ణయానికి వ్యతిరేకమని, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande