ఢిల్లీ, 5 అక్టోబర్ (హి.స.)ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇంతకాలం వ్యాలిడ్ ఫాస్టాగ్ లేని వాహనదారులు రెట్టింపు టోల్ చార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఈ నిబంధనను సడలించిన కేంద్రం, యూపీఐ ద్వారా చెల్లించే వారు అదనంగా 25 శాతం చార్జీ చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. అదే నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం డబుల్ చార్జీ చెల్లించాల్సిందే. ఈ నిబంధనలు నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం, జాతీయ రహదారుల్లో సరైన ఫాస్టాగ్ ద్వారా రూ.100 టోల్ చెల్లించాల్సి వస్తే.. యూపీఐ ద్వారా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అదే నగదు రూపంలో అయితే రూ.200 కట్టాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV