చెన్నై ,05 అక్టోబర్ (హి.స.) టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై నటి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ (Khusbu Sundar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా ప్రణాళికతో, కావాలని చేసినట్లు కన్పిస్తోందని ఆరోపిస్తూ.. తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని ఖుష్బూ పేర్కొన్నారు. ఇది ఎవరో కావాలని సృష్టించినట్లు ఉందన్నారు. విజయ్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదని విమర్శించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారని.. మౌనంగా ఉన్న సీఎం స్టాలిన్ దీనిపై మాట్లాడాలన్నారు. ర్యాలీలో పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారని ఆమె ప్రశ్నించారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు బయటకు వచ్చాయన్నారు.
కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ