అమెరికాలో దీపావళికి సెలవు.. అధికారికంగా ప్రకటించిన కాలిఫోర్నియా
హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.) మన దీపావళి పండుగకు అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తింపు దక్కింది. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఏబీ-268 బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ సం
అమెరికా దీపావళి


హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)

మన దీపావళి పండుగకు అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తింపు దక్కింది. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఏబీ-268 బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ సంతకం చేశారు.

దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ గతంలోనే ఆ దేశ కాంగ్రెస్లో ఓ బిల్లును తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లును గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇది చట్టంగా మారింది.

ఇప్పటికే అమెరికాలోని పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande