చలో బస్ భవన్కు పిలుపు.. మాజీ మంత్రి హరీశ్రావు హౌస్ అరెస్ట్
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి బస్భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయ
హరీష్ రావు


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి బస్భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్రావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, కేటీఆర్ వాస్తవానికి ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని రేతిఫైల్ బస్ స్టాప్ నుంచి బస్లో ప్రయాణం చేస్తూ బస్ భవన్కు చేరుకోవాలి. ఇక మాజీ మంత్రి హరీశ్రావు ఉదయం 8.45కు బస్సులో మెహిదీపట్నం బస్టాప్ నుంచి బస్ భవన్కు చేరుకోవాల్సి ఉండగా వారిని పోలీసులు అడుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande