డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్
అమరావతి,10 నవంబర్ (హి.స.) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) డిసెంబర్ 6వ తేదీన డాలస్‌లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ
బీహార్ లో నారా లోకేష్.. ఎన్డీఏను గెలిపించాలని పిలుపు


అమరావతి,10 నవంబర్ (హి.స.) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) డిసెంబర్ 6వ తేదీన డాలస్‌లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ డాలస్ సభ ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని ఓ కార్యచరణ రూపొందించారు ఎన్నారై టీడీపీ సభ్యులు. లోకేష్ సభ కోసం ఒక స్టీరింగ్ కమిటీ, వారితో అనుసంధానం చేసుకుంటూ సెక్యూరిటీ, భోజనాలు, స్వాగతసన్నాహకాలు, వేదిక ఏర్పాట్లు వంటి ఒక్కో బాధ్యతను నిర్వహించేందుకు ఇతర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాలుపంచుకునేందుకు కొందరు సభ్యులు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లు నమోదు చేసుకున్నారు.

సమావేశానికి హాజరు కాలేకపోయిన ఇతర సభ్యులు, కింద జత చేసిన లింక్ ద్వారా మీకు ఆసక్తి ఉన్న ఈ కమిటీల్లో వారి పేరు, కాంటాక్ట్ వివరాలు పొందుపరచవచ్చని డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande