ఆస్ట్రేలియా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.! 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడడం పై నిషేధం.
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ఆస్ట్రేలియా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆన్లైన్ సురక్షతను కాపాడేందుకు 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలో
ఆస్ట్రేలియా ప్రభుత్వం


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ఆస్ట్రేలియా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

పిల్లల ఆన్లైన్ సురక్షతను కాపాడేందుకు 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆన్లైన్ సేఫ్టీ ఎమెండ్మెంట్ బిల్-2024ను ఆమోదించింది. ఈ బిల్ 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధించింది. ఈ చట్టం ప్రకారం, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా కంపెనీలు 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఖాతాలు కల్పించకూడదు. 2025 డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడుతూ.. సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆల్బనీస్ స్పష్టం చేశారు. ఈ నియమాలను ఉల్లంఘించే కంపెనీలకు సుమారు A$49.5 మిలియన్ల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. ఆన్లైన్ వేదికల నియంత్రణలో ఇది ప్రపంచంలోనే తొలి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. అయితే వయస్సు నిర్ధారణ విధానం, అమలులో సాంకేతిక సవాళ్లపై నిపుణులు ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దేశ ప్రజల్లో 64 శాతం మంది ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ చట్టం ప్రపంచ దేశాలకు కూడా ఒక మోడల్గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande