ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
దిల్లీ, 10 నవంబర్ (హి.స.): దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌- 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎ
Blast


దిల్లీ, 10 నవంబర్ (హి.స.): దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌- 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సోమవారం సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్‌ టీమ్‌, ఎన్‌ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande