దగ్గుమందు మరణాలు.. తయారీ కంపెనీలకు కేంద్రం అల్టిమేటం
న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.) ఇటీవల కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్ లో 20కి పైగా చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దగ్గుమందు తయారీ కంపెనీలకు అల్టిమేటం జారీ చేసింద
దగ్గు మందు


న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)

ఇటీవల కోల్డ్ రిఫ్ దగ్గుమందు

కారణంగా మధ్యప్రదేశ్ లో 20కి పైగా చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దగ్గుమందు తయారీ కంపెనీలకు అల్టిమేటం జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని ఆదేశించింది. లేదంటే కంపెనీలు వాటిని తయారు చేయడం మానుకోవాల్సిందేనని హెచ్చరించింది.

తమిళనాడు కాంచీపురంకు చెందిన శ్రేసన్ ఫార్మా కంపెనీ దగ్గు మందు తయారు చేసింది. అది సేవించిన చిన్నారులు మరణించడంతో అధికారులు శాంపిల్స్ ను సేకరించి పరీక్షించగా.. సిరప్ లో 48.6 శాతం హైలీ పాయిజన్డ్ డై ఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు.. సదరు కంపెనీరు 3005 పైగా ఉల్లంఘనలను రికార్డ్ చేసినట్లు చెప్పారు. దీంతో ఆ కంపెనీకి తమిళనాడు సర్కార్ సీల్ వేసి, లైసెన్స్ రద్దు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande