
న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్
ఢిల్లీ వాయి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో... ఢిల్లీ నుండి రాంచీ మార్గంలో ప్రయాణిస్తున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎల్లప్పుడూ తక్కువ నాణ్యత కలిగిన గాలి ఉండటం తనను ఆందోళన పెట్టిస్తోందని చెప్పారు.
ఈ విధంగా మా ఇంటివద్ద సూర్యాస్తమయం ఉంటుందని పేర్కొన్నారు. తన పిల్లలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని, కానీ ఢిల్లీలో ఇళ్లకే పరిమితం అవ్వాలని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..