ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందెశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలి
అందెశ్రీ మరణం


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత

రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందెశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. అందెశ్రీ హఠాన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, సాహితీ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande