
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
న్యూఢిల్లీ: ‘10 నవంబర్ (హి.స.)
పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్‌లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ