
పుట్టపర్తి, 10 నవంబర్ (హి.స.)
:శ్రీసత్యసాయి జిల్లాలో తొలిసారిగా ఫైబర్ టెక్నాలజీతో రహదారి నిర్మాణం చేపట్టారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి కోడూరు వరకు 342వ నంబరు జాతీయ రహదారి (నాలుగు వరుసలు) నిర్మాణం సాగుతోంది. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద జరుగుతున్న పనులను డెన్మార్క్ ప్రతినిధులు జోష్ సెబాస్టియన్, మైక్ గ్లోవర్‌తో కలిసి జాతీయ రహదారుల ఈఎన్‌సీ రామచంద్ర ఆదివారం పరిశీలించారు. ‘డెన్మార్క్‌కు చెందిన ఈ ఆఽధునాతన ఫైబర్ టెక్నాలజీ ఇప్పటికే హీత్రో ఎయిర్‌పోర్టు (యూకే), దుబాయి మెట్రో, జర్మనీ ఏ7 మోటార్‌వే వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టుల్లో విజయవంతమైంది. తారు మిశ్రమంలో ఆరమిడ్, పాలియోలెఫిన్ ఫైబర్లను కలపడం ద్వారా రహదారులపై గుంతలు, పగుళ్ల సమస్యలకు చెక్ పడుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా రహదారుల జీవితకాలం 50శాతం పెరగడంతోపాటు మరమ్మతుల అవసరం గణనీయంగా తగ్గుతుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఫైబర్‌ను మళ్లీ వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ