తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నటుడు అభినయ్ కింగర్ మృతి
తమిళనాడు, 10 నవంబర్ (హి.స.) తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ ఈ ఉదయం కన్నుమూశారు. కింగర్ కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం వి
నటుడు మృతి


తమిళనాడు, 10 నవంబర్ (హి.స.) తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం

చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ ఈ ఉదయం కన్నుమూశారు. కింగర్ కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కింగర్ మరణవార్తతో కోలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

'అరుముగ్', 'ఆరోహణం', 'సక్సెస్' లాంటి పలు చిత్రాల్లో నటించి అభినయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారిగా 'వల్లవనుక్కు పుల్లుం ఆయుధం' అనే చిత్రంలో కనిపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande