
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
జమ్మూ 10 నవంబర్ (హి.స.) కశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. ఇటీవల అనంతనాగ్‌లో డాక్టర్ ఆదిల్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి లాకర్ నుంచి ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకొన్నారు. అతడిని విచారించగా లభించిన సమాచారం ఆధారంగా నేడు ఫరీదాబాద్ వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో ఏకంగా 360 కిలోల పేలుడు పదర్థాలు, ఒక అసాల్ట్ రైఫిల్, ఇతర రసాయనాలు తదితరాలు ఉన్నాయి.
ఫరీదాబాద్‌కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద ఈ పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు గుర్తించామన్నారు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వీరిద్దరికి ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ