
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
సాసారాం,10 నవంబర్ (హి.స.) బిహార్‌లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలని అనుకుంటుంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం చొరబాటుదారుల కారిడార్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాసారాం, అర్వల్ పట్టణాల్లో ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘ఇటీవల రాహుల్ గాంధీ, లాలూ కుమారుడు (తేజస్వి యాదవ్) బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. దీని ప్రధాన లక్ష్యం చొరబాటుదారులను రక్షించడం. రాహుల్‌గాంధీకి నిజంగా ఓటు చోరీ జరుగుతున్నట్లు అనుమానాలుంటే నిబంధనల ప్రకారం ఫిర్యాదు ఎందుకు చేయడం లేదు? అధికార పీఠాలపై మన్మోహన్‌సింగ్, లాలూ ఉన్నప్పుడు ఈ దేశ గడ్డపై ఉగ్రదాడులు జరిగేవి. ఇప్పుడు ముష్కరుల ఇళ్లలోకి వెళ్లి మరీ మనం చితకబాదుతున్నాం. భవిష్యత్తులో భారత్‌పై దాడి చేయాలంటే వారు ఆలోచించాల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ