
అమరావతి, 10 నవంబర్ (హి.స.)ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత, కవి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయిన అందెశ్రీ (Ande Sri) హఠాన్మరణం తనకు దిగ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారన్నారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన అని గుర్తు చేసకున్నారు. పలు సినీ గీతాలు రచించారన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుందన్నారు. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ (Jaya Jayahe Telangana) అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారన్నారన్నారు. రాష్ట్ర గీతంతో తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారన్నారు. అందెశ్రీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV