దేవాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : ఎన్టీఆర్ జిల్లా పోలీస్
విజయవాడ, 10 నవంబర్ (హి.స.)కార్తీక సోమవారాన్ని (Karthika Somavaram) పురస్కరించుకొని దేవాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయాలు, ఘాట్ల వద్ద అదనపు సిబ్బందిని
tight-security-arrangements-at-temples-ntr-district-police-492689


విజయవాడ, 10 నవంబర్ (హి.స.)కార్తీక సోమవారాన్ని (Karthika Somavaram) పురస్కరించుకొని దేవాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయాలు, ఘాట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించామన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు (SV Rajashekar Babu) ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తెల్లవారుజాము నుంచే కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. దేవాలయాలు, ఘాట్ల వద్దకు సిబ్బందితో కలిసి వెళ్లారు. బెల్ హెల్లర్స్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు దీపాలు వెలిగించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను (CC Cameras) ఏర్పాటు చేయడం, డ్రోన్ కెమెరాల సహాయంతో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. సిబ్బందికి తగు సూచనలిస్తూ శాంతియుత వాతావరణంలో, భక్తి పూర్వకంగా దర్శనాలు పూర్తి చేసుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande