సిపి బ్రౌన్ కు వైయస్ జగన్ నివాళులు
అమరావతి, 10 నవంబర్ (హి.స.)నేడు తెలుగు-ఇంగ్లీష్ నిఘంటవు రూపకర్త సిపి బ్రౌన్ (CP Brown) జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకొని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. సిపి బ్రౌన్ తెలుగు భాషను ప్రేమించారన్నారు
ys-jagan-pays-tribute-to-cp-brown-492680


అమరావతి, 10 నవంబర్ (హి.స.)నేడు తెలుగు-ఇంగ్లీష్ నిఘంటవు రూపకర్త సిపి బ్రౌన్ (CP Brown) జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకొని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. సిపి బ్రౌన్ తెలుగు భాషను ప్రేమించారన్నారు. తెలుగు సాహిత్యాన్ని (Telugu Literature) ముద్రించి భద్రపరచారని పేర్కొన్నారు. ప్రపంచానికి తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసిన మహానుభావుడు బ్రౌన్ అని కొనియాడారు. తెలుగు పదాలను సమీకరించి సమకూర్చిన తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసిందన్నారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande