దగ్దమైన మరో ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులు సురక్షితం..
నల్గొండ, 11 నవంబర్ (హి.స.) ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిటయమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంల
బస్సు ప్రమాదం


నల్గొండ, 11 నవంబర్ (హి.స.) ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిటయమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

విహారి ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందికి దింపేశారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande